యాసిన్‌కు బాగోలేదు…వెంటనే విడిచిపెట్టండి: మెహబూబా


శ్రీనగర్ : కశ్మీర్ వేర్పాటు వాద నేత యాసిన్ మాలిక్‌కు నిజంగానే ఆరోగ్యం బాగోలేదని, ఆయనను తక్షణం విడిచిపెట్టాలని పీడీపీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. అరెస్టు చేసిన జమాతే ఇస్లామి సభ్యులను కూడా విడిచిపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. బుధవారంనాడు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ,  జేకేఎల్‌పై నిషేధాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత సాధ్వి ప్రగ్యా సింగ్ ఠూకూర్‌ను ఎలా విడిచిపెట్టారంటూ ప్రశ్నించారు.
 
కాగా, 2017లో ఉగ్రవాదులకు నిధుల చేరవేత, కుట్ర కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను వచ్చేనెల 24 వరకు జ్యుడీషియల్ కష్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని పటియాలా కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. మరోవైపు యాసిన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు అనుమతించాలంటూ తీహార్ జైలు అధికారులు పటియాలా కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందన తెలియజేయాలంటూ మలిక్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ నెల 10న యాసిన్ మాలిక్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసి 22వ తేదీ వరకు తమ కస్టడీలో ఉంచి విచారించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *