యాసిన్ మాలిక్ 'ధైర్యం' అభినందనీయం: చాకో


శ్రీనగర్ : కశ్మీర్ వేర్పాటువాద నేత, నిషేధిత జేకేఎల్‌ఎఫ్ చీఫ్‌ యాసిన్ మాలిక్‌ను మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యం చూపించిన వ్యక్తిగా కాంగ్రెస్ ప్రతినిధి పీసీ చాకో ప్రసంసించారు. పదేళ్ల క్రితం నాటి కేసు విచారణను జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బదిలీ చేయాలంటూ యాసిన్ మాలిక్ చేసిన విజ్ఞప్తిని జమ్మూకశ్మీర్ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చిన నేపథ్యంలో చాకో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
‘యాసిన్ మాలిక్‌ సిద్ధాంతాన్ని కానీ, చర్యలను కానీ నేను సమర్ధించడం లేదు. ప్రభుత్వం ఆయనను బెదరించాలని చూస్తోంది. దీన్ని ధైర్యంగా ఆయన ఎదుర్కొంటున్న తీరు ప్రసంశనీయం. న్యూఢిల్లీ ఎవర్నీ బెదరించలేదు…ఎందుకంటే ఇండియా ప్రజాస్వామిక దేశం’ అని చాకో అన్నారు. తుపాకీ చూపించి మాలిక్‌ను లొంగదీసుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చాకో ఆరోపించారు. ‘దోషిగా తేలిన ప్రగ్యా సింగ్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. యాసిన్ మాలిక్‌ను మాత్రం వేర్పాటువాదం పేరుతో తుపాకీ చూపించి మరీ లొంగిపొమ్మని బెదిరిస్తున్నారు. యాసన్ మాలిక్‌ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆత్మగౌరవం ఉన్న ఎవరైనా స్పందిస్తారు’ అని ఆయన అన్నారు.
 
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలపై యాసిన్ మాలిక్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో (మే 24 వరకూ) ఉన్నారు. 1990లో నలుగురు భారత వైమానిక దళ సిబ్బంది మృతికి సంబంధించిన కేసులోనూ యాసిన్ మాలిక్ విచారణను ఎదుర్కొంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *