యువతిపై ఆరుగురి గ్యాంగ్‌రేప్‌


  • సహచరుడి కళ్లెదుటే దారుణం
బెంగళూరు, మే 10: మైసూర్‌లో దారుణం జరిగింది. సహచరుడితో కలిసి నగర విహారం చేస్తున్న 23 ఏళ్ల యువతిపై ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన సహచరుడిని రాళ్లతో చావకొట్టి.. అతడి కళ్లెదుటే దారుణానికి ఒడిగట్టారు. పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలు ఓ హోటల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. గత బుధవారం రాత్రి సహచరుడితో కలిసి బయటకొచ్చింది. నగరంలోని లింగాబుడీలో ఆగిన వారిని ఆరుగురు యువకులు అటకాయించారు. పెద్ద రాయితో సహచరుడి కాలిపై తీవ్రంగా కొట్టారు. అనంతరం అతడి ఎదుటే ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎనిమిది పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కాగా, రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో తనపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని ఉరితీయాల్సిందేనని బాధిత మహిళ డిమాండ్‌ చేసింది. ‘‘ఉరికంటే ఇంకా భయంకరమైన శిక్ష ఏదైనా ఉంటే ఆ శిక్ష వాళ్లకు విధించాలి.’’ అని బాధితురాలు కోరింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *