యువత పకోడీలు అమ్ముకోవాలనుకోవడం లేదు: మాయావతి


లఖ్‌నవూ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బీఎస్‌పీ సుప్రెమో మాయావతి విరుచుకుపడ్డారు. యువత ఉద్యోగాల కోరుకుంటుంటే బీజేపీ ప్రభుత్వం పకోడీలు వేసుకొమ్మంటుందని, అయితే యువత పకోడీలు వేసుకోవాలనుకోవడం లేదని అన్నారు. పకోడీలు వేసుకోమనడం, చాయ్‌లు అమ్ముకోమనం ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమని అన్నారు.
 
మంగళవారం ట్విట్టర్ ద్వారా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు, ముఖ్యంగా చదువుకున్న యువత నిరుద్యోగంలో మగ్గిపోతున్నారు. అయితే వారు పకోడీలు వేసుకోవడం, చాయ్‌లు అమ్ముకోవడం, కాపలాదారులుగా మారిపోవడం లాంటివి చేయడానికి సిద్ధంగా లేరు. ఇవి పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు’’ అని ట్వీట్ చేశారు.
 
‘‘ఓటు అనేది అమూల్యమైన రాజ్యాంగ హక్కు. ఓటుతో తమకు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు పౌరులకు ఉంటుంది. తమను ఎవరైతే సంతోషంగా ఉంచగలుగుతారో, ఎవరైతే తమ అవసరాలు తీరుస్తారో వారికి అధికారం ఇస్తారు’’ అని మరో ట్వీట్ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *