యూపీ కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు


  • మీ ఓటు బీజేపీ లేదా కాంగ్రెస్ కు వేయండి…
  • మహాకూటమికి మాత్రం వేయొద్దు…
ప్రతాపఘడ్ : ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నసీముద్దీన్ సిద్ధిఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ ఓటు బీజేపీ లేదా కాంగ్రెస్ కు వేయండి కానీ, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలతో కూడిన మహాకూటమికి మాత్రం వేయొద్దు…’’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నసీముద్దీన్ సిద్ధిఖీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓటర్లను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి రత్నాసింగ్ కు మద్ధతుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ నేత నసీముద్దీన్ మహాకూటమి తప్ప కాంగ్రెస్ లేదా బీజేపీకి ఓటేయాలని కోరడం సంచలనం రేపింది. ‘‘మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రత్నాసింగ్ కు ఓటేయండి లేదా బీజేపీకి అయినా వేయండి కాని మీ ఓటును అమ్ముకోవద్దు’’ అని కోరారు. మహాకూటమిలో పార్టీ టికెట్లను మాయావతి విక్రయించారని ఆయన ఆరోపించారు. మాయావతి గురించి తనకు తెలుసునని, ఒక్కో టికెట్టును 5 నుంచి 10 కోట్లకు విక్రయించారని సిద్ధిఖీ ఆరోపించారు. గతంలో మాయావతి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసిన సిద్ధిఖీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సిద్ధిఖీని మాయావతి బీఎస్పీ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ లో చేరిన సిద్ధిఖీ బీఎస్పీ ఉన్న మహాకూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *