యోగి వర్సెస్‌ బాబా


  • యూపీలో అఖిలేశ్‌ కొత్త అస్త్రం
లఖ్‌నవూ, మే 4: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లోకి కొత్త ‘బాబా’ అడుగుపెట్టారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌లానే కాషాయ వస్త్రాలు ధరించిన ఆయన.. ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ తరఫున ప్రధాన ప్రచారాస్త్రం కాబోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ వ్యూహాత్మకంగా ఈ బాబాను రంగంలోకి దించారు. అయితే ఆయన ఎవరనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. హెలికాప్టర్‌ వద్ద కాషాయ రంగు దుస్తుల్లో ఉన్న ‘బాబా’తో కలిసి ఉన్న ఫొటోను అఖిలేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘మేము నకిలీ దేవుడిని తీసుకురాలేం. కానీ బాబాజీని తీసుకొచ్చాం. ప్రభుత్వం గురించి నిజానిజాలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఆయన వివరిస్తారు’’ అని ట్వీట్‌ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *