రన్‌వే నుంచి ఎగిరి నదిలో దిగిన విమానం


ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జాక్సన్‌విలే‌లో 140 ప్రయాణికులను తీసుకువెళుతున్న బోయింగ్ 737 నదిలో కూలిపోయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం విమానం జాక్సన్‌విలేకు చెందిన రన్‌వే నుంచి గాలిలోకి లేచింది. తరువాత అది నేరుగా సెయింట్ జాన్స్ నదిలో కూలిపోయింది. ఈ కమర్షియల్ ఫ్లయిట్‌లో 133 మంది ప్రయాణికులు, ఏడుగురు క్రూ సిబ్బంది… మొత్తంగా 140 మంది ఉన్నారు. అయితే విమానం నీటిలో పూర్తిగా మునగక పోవడంతో, దానిలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. వీరిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని జాక్సన్‌విలే మేయర్ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. సంఘటన జరిగిన వెంటనే ఫైర్, రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించామని వారు సహాయక చర్యల్లో నిమగ్నమైవున్నారని తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *