రమేశ్‌‌తో రాజీనామా చేయించం: ఎమ్మెల్యే గణేశ్‌


బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీలో రెబల్‌గా మారి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళిను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేయమని కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌ వెల్లడించారు. హొసపేట్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రమేశ్‌ జార్కిహొళి చేత రాజీనామా చేయించమన్నారు. నేరుగా రమేశ్‌జార్కిహొళిను భేటీ అవుతానని పలు విషయాలు చర్చించుకోవాల్సి ఉందని అన్నారు.
 
ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ తనకు అన్నలాంటివారన్నారు. నేను, నా తండ్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు పనులు చేశామని చెప్పారు. ఆనంద్‌సింగ్‌కు, తనకు జరిగిన గొడవను సర్దుబాటు చేసేందుకు అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. కోర్టులో వివాదం ఉన్నందున అంతకుమించి మాట్లాడలేనన్నారు. ఆనంద్‌సింగ్‌పై దాడి తర్వాత జైలులో గడిపిన ఎమ్మెల్యే గణేశ్‌ బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *