రాజధానిలో ప్రతీ ఏటా 3.2 లక్షలకు పెరుగుతున్న ఓటర్లు


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 1,43,27,458 మంది ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 64.42 లక్షల మహిళలు, 11 వేల సర్వీస్ ఓటర్లు, 669 థర్డ్ జండర్లు ఉన్నారు. 2018 ఆగస్టులో 1, 36, 15,776 మంది ఓటర్లు నమోదైవున్నారు. అంటే 9 నెలల్లో ఓటర్ల సంఖ్య 7.12 లక్షలకు పెరిగింది. ఇంతేకాదు గత 10 ఏళ్ల విషయానికొస్తే ఢిల్లీలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 1.11 కోట్లుగా ఉంది. ఈసారి ఇది 1.43 కోట్లకు చేరుకుంది. దీని ప్రకారం ప్రతీఏటా ఢిల్లీలో ఓటర్ల సంఖ్య 3.2 లక్షలకు పెరుగుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి 1.27 కోట్ల మంది ఓటర్లున్నారు. ఈవిధంగా చూస్తే గడచిన ఐదేళ్లలో ఓటర్ల సంఖ్య 16 లక్షలకు పెరిగినట్లు తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *