రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు…


కాంతపద: న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (22812) పవర్ కార్‌లో శనివారంనాడు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒడిశాలోని కాంతపదలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సకాలంలో ట్రైన్ ఎస్టార్ట్ సిబ్బంది, ఆన్ డ్యూటీ గార్డ్ ఈ మంటల్ని గుర్తించి, సంబంధిత అధికారులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో భారీ ప్రమాదం తప్పింది. రైలుకు వెనుకవైపు ఉన్న జనరేటర్ కారును రైలు నుంచి విడగొట్టడంతో మంటలు పాసింజర్ కోచ్‌కు విస్తరించలేదు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఒడిశా అగ్నిమాక సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ అకాడమీ సిబ్బంది సకాలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం రైలు యథాప్రకారం భువనేశ్వర్‌కు బయలుదేరి వెళ్లింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *