రాజీవ్‌గాంధీపై మరిన్ని విమర్శలు గుప్పించిన మోదీ


న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ మరింత పదునుపెట్టారు. స్థానిక రామ్‌లీలా మైదానంలో బుధవారంనాడు జరిగిన భారీ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల హాలిడే ట్రిప్ కోసం నావికా సిబ్బందిని అప్పట్లో ఉపయోగించుకున్నారని చెప్పారు. అప్పట్లో తీర ప్రాంతాల హద్దుల పరిరక్షణ కోసం ఐఎన్ఎస్ విరాట్‌ను మోహరించినప్పుడు, రాజీవ్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యుల హాలిడే ట్రిప్‌ కోసం ఐఎన్ఎస్ విరాట్‌ను ఉపయోగించుకున్నారని, అందులోనే వారు  ఐలాండ్ వెళ్లారని వెల్లడించారు. ఆ సమయంలో 10 రోజుల పాటు అదే ద్వీపంలో ఐఎన్‌ఎస్ విరాట్‌ను ఉంచారని చెప్పారు. రాజీవ్ బంధువర్గం కూడా అప్పుడు ఐఎన్ఎస్ విరాట్‌లో ప్రయాణించారని, ఇది జాతీయ భద్రతతో రాజీపడటం కాదా అని మోదీ సూటిగా ప్రశ్నించారు.
 
కాగా, ప్రధాని మోదీ గత వారం యూపీలోని ప్రతాప్‌గఢ్‌ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తూ రాజీవ్ గాంధీని తప్పుపట్టారు ‘మీ తండ్రిని ఆయన అనుయాయులు మిస్టర్ క్లీన్ అంటారు. నెంబర్ వన్ అవినీతిపరుడిగా ఆయన జీవితం ముగిసింది’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. తాజాగా, ఆయన మరోసారి రాజీవ్ గాంధీపై విమర్శలు గుప్పించి మరోసారి దూకుడు ప్రదర్శించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *