రాజీవ్ మరణానికి కారణం మీరే కదా: అహ్మద్ పటేల్


న్యూఢిల్లీ: బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి ద్వేషమే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి కారణమైందన్నారు. నంబర్ వన్ అవినీతిపరుడు అంటూ రాజీవ్ గాంధీ‌ని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ విమర్శించిన విషయం తెలిసిందే. దీనికి పటేల్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఆయనేమన్నారంటే.. ‘‘అమరుడైన ఓ ప్రధానిని విమర్శించడం అంటే పిరికితనానికి ప్రతీక. కానీ ఆయన హత్యకు కారకులు ఎవరు? రాజీవ్‌కు అదనపు భద్రత కల్పిండానికి బీజేపీ మద్దతుతో ఏర్పడిని వీపీ సింగ్ సర్కార్ నిరాకరించింది. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. ఒక వ్యక్తిగత భద్రతా అధికారిని ఇచ్చి.. చేతులు దులిపేసుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలను బేఖాతరు చేశారు. వారి విద్వేషానికి రాజీవ్ బలయ్యారు. బీజేపీ చేస్తున్న నిరాధార ఆరోపణలకు, తిట్లకు సమాధానం ఇచ్చుకోవడానికి ఆయనిప్పుడు లేరు’’ అని ట్వీట్ చేశారు.
 
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *