రామకృష్ణ మిషన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న మోదీ


న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ బుధవారం ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు. సన్యాసిగా మారుదామనుకున్నారట కదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ…  రామకృష్ణ మిషన్ తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలిపారు. కోల్‌కతాలోని నాటి రామకృష్ణ మిషన్‌‌ ప్రెసిడెంట్ స్వామి ఆత్మస్థానానంద జీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తానంటే స్వామీజికి చాలా ఇష్టమని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఆత్మస్థానానందజీని తన నివాసానికి ఆహ్వానించి సత్కరించుకున్నానని.. అలాగే ప్రధాని అయిన తర్వాత కోల్‌కతాలోని ఆశ్రమానికి వెళ్లి.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నానన్నారు. ఆయన వందేళ్ల వయస్సులో స్వర్గస్థులయ్యారని తెలిపారు.
 
రాజకీయాలలోకి రాకముందు ఆయన దగ్గరకు వెళ్లి ఎన్నో విషయాలను తెలుసుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జీవితం అంటే ఏంటో చెప్పేవారని.. స్వామి వివేకానంద విశ్రమించిన గదిలో గంటల తరబడి ఉండే అవకాశాన్ని కల్పించేవారన్నారు. జీవితంపై ఆ సమయంలో కొంచెం గందరగోళం ఉండేదని.. సరైన మార్గదర్శనం కూడా లేదన్నారు. జీవితం అలా అలా ప్రయాణిస్తూ ఇక్కడికి చేరుకుందని.. ఆనాటి విషయాలను తెలిపారు. 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *