రాయచూరుపైనే ఇరు పార్టీల కసరత్తు!


బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాయచూరు స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీలు భారీ కసరత్తు చేశాయి. ఇక్కడ రెండుపార్టీలదే హవా ఉండడంతో ఇరు పార్టీల అగ్రనేతలు గెలుపుకోసం తీవ్రంగా ప్రచారాలు చేశారు. నియోజకవర్గంలో మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ వర్గీయులదే నిర్ణయంగా ఉంటుంది. ఎస్టీ రిజర్వు నియోజకవర్గమైన రాయచూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బి.వి.నాయక్‌, బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్‌నాయక్‌లు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 19,27,758 మంది ఓటర్లు ఉండగా వీరిలో 9,55,586మంది పురుషులు కాగా 9,71,805మంది మహిళలు, 367 మంది ఇతరులు ఉన్నారు. పురుషులకంటే 16వేలమంది అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గంగా కూడా రాయచూరుకు పేరుంది.
 
నియోజకవర్గ పరిధిలో 8 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో రాయచూరు నగర – శివరాజ్‌ పాటిల్‌ (బీజేపీ), దేవదుర్గ – శివనగౌడ నాయక్‌ (బీజేపీ), యాదగిరి – వెంకటరెడ్డి ముద్దాళ (బీజేపీ), సురపుర – నరసింహ నాయక్‌ (బీజేపీ)లు ఉండగా రాయచూరు గ్రామీణ – బసవనగౌడ దద్దల (కాంగ్రెస్‌), లింగసగూరు – డి.ఎ్‌స.హుళగేరి (కాంగ్రెస్‌), శహపుర – శరణబసప్ప దర్శనాపుర (కాంగ్రె్‌స)తోపాటు మాన్వి నుంచి రాజా వెంకటప్ప నాయక్‌ (జేడీఎస్‌) ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో భగవంతరాయ నాయక్‌కు 4,43,659 ఓట్లు రాగా బీజేపీకి చెందిన శివనగౌడ నాయక్‌కు 4,42,160 ఓట్లు దక్కాయి. కేవలం 1,499 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ కు చెందిన భగవంతరాయనాయక్‌ గెలుపొందారు. మరోసారి బీజేపీ తన ప్రాబల్యం ద్వారా దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *