రాయలసీమలో ఎండ తీవ్రత


విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ, కోస్తాల్లో శనివారం అనేకచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. అయితే ద్రోణి ప్రభావంతో మధ్యాహ్నం నుంచి కొన్నిచోట్ల మేఘాలు ఆవరించి వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల ఎండప్రభావానికి ప్రజలు సొమ్మసిల్లిపోయారు. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అయితే మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావడానికి వెనుకంజ వేశారు. రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో రెండు, మూడుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. శనివారం తిరుపతిలో 41.2 డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఎండ ప్రభావం కొంత తగ్గుతుందని పేర్కొంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *