రాష్ట్రానికి కేపీఎస్సీ బృందం


అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటక పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(కేపీఎస్సీ)కు చెందిన ఇద్దరు సభ్యుల బృందం గురువారం ఏపీకి వచ్చింది. డాక్టర్‌ చంద్రకాంత్‌ఖేరి, డాక్టర్‌ రోనాల్డ్‌ అనిల్‌ ఫెర్నాండెస్‌ విజయవాడలో ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ను, సభ్యులను కలిశారు. వివిధ రిక్రూట్‌మెంట్లకు సంబంధించి ఏపీపీఎస్సీ అనుసరిస్తోన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు వీరు వచ్చారు. గురువారం జరిగిన డిప్యూటీ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్స్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ పరీక్షల నిర్వహణను, విజయవాడలోని టీసీఎ్‌స-ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌ సెంటర్‌ను సందర్శించారు. శుక్రవారం కూడా రాష్ట్రంలో వీరు అధ్యయనం చేస్తారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *