రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమా?


  • విజయసాయి, రామచంద్రయ్య చీడపురుగులు
  • పిచ్చికుక్కల్లా అరుస్తున్నారు: కుటుంబరావు
అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం వేల కోట్లు అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపిస్తున్న వైసీ పీ నేతలు విజయసాయిరెడ్డి, సి.రామచంద్రయ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తనతో బహిరంగ చర్చకు రావాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరు కూరి కుటుంబరావు సవాల్‌ విరిశారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద మాట్లాడుతూ ప్రాధాన్యాలు లేకుండా ఖర్చు చేయడం వల్ల అప్పు లు పెరిగాయని విజయసాయిరెడ్డి, రామచంద్రయ్య పిచ్చికుక్క(పీకే)లా అ రుస్తున్నారని మండిపడ్డారు.
 
‘ఇలాంటి పీకేలను చాలా మందిని చూశాం. సన్నాసుల్లా మాట్లాడుతున్న వీళ్లు చార్టర్డ్‌ అకౌంటెంట్లా? సీఏ వ్యవస్థకే వీళ్లు చీడపురుగుల్లా తయారయ్యారు. రాష్ట్రానికి నిధులివ్వకుండా మోదీ ప్రభు త్వం మోసం చేస్తుంటే, జగన్‌, విజయసాయిరెడ్డి ఒక్క ట్వీట్‌ అయినా చేశా రా? నిధులడిగితే రూపాయికి ఏడాది చొప్పున జైలు శిక్ష పెంచుతారని వారిద్దరికీ భయం’ అని ఎద్దేవా చేశారు. తనను స్టాక్‌ బ్రోకర్‌ అంటున్న విజయసాయిరెడ్డి బతుకంతా బెయిల్‌పై బతకడమేనన్నారు. ‘సీనియర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు, పాలనాదక్షుడు చంద్రబాబును విమర్శించే స్థాయా వీళ్లది. మరోసారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది’ అని హెచ్చరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *