రాహుల్‌కు కీలక రిపోర్టిచ్చిన చంద్రబాబు


ఢిల్లీ: సీఎం చంద్రబాబు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో విచారణ, విపక్షపార్టీలన్నింటితో కలిసి ఈసీని కలిసే పనిలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బుధవారం హఠాత్తుగా రాహుల్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అరగంటపాటు జరిగిన ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్, ఇక ముందు రెండు విడుతల్లో జరుగనున్న పోలింగ్ సరిళిని పూర్తిగా విశ్లేషించిన చంద్రబాబు… ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఓ అంచనాకు వచ్చి, ఆ రిపోర్టును రాహుల్‌కు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్‌కు చంద్రబాబు ఇచ్చిన రిపోర్టులో ఏముంది? రాష్ట్రాల వారిగా ఫలితాల అంచనాను చెప్పారా? లేదా మొత్తంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అంచానాను చెప్పారా? అన్నది తేలాల్సి ఉంది. 
 
పూర్తి మెజార్టీతో గెలుస్తామని బీజేపీ నేతలు బయటకు ధీమాగా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. 2014లో మోదీకి ఉన్నంత సానుకూలత ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ  లేదు. ఐదేళ్లలో పేద, మధ్య తరగతి వర్గాలను నేరుగా ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్న కేంద్రం తీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో అసలు బీజేపీకి  మెజార్టీ ఎంత వస్తుంది? అటుపై కాంగ్రెస్ ఎంతవరకు కోలుకుంటుంది? లేదా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందా? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితిల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం.. లేదా ఆ పార్టీ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయనేది రాజకీయ నిపుణులు అంచానా. ఇదే విషయాన్ని చంద్రబాబు, రాహుల్‌కు ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చంద్రబాబు అంచనా ప్రకారం బీజేపీకి వంద సీట్లు కచ్చితంగా తగ్గిపోతాయని ఆయన అంచనా వేస్తున్నారు.
 
మరోవైపు అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందని చంద్రబాబు తన రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే బీజేపీ కన్నా కాంగ్రెస్‌కు యాభై సీట్లు తక్కువ వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఏపీలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని చంద్రబాబు, రాహుల్‌కు ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొనట్లు సమాచారం. ప్రధాని మోదీ, బీజేపీ అధినేత అమిత్‌షా రాజకీయాలకు చెక్ పెట్టే వ్యూహాలపై రాహుల్‌కు చంద్రబాబు సలహాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *