రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు


బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హత్యకు కుట్ర సాగుతోందనే కాంగ్రెస్‌ పార్టీ హోం మంత్రిత్వశాఖకు రాసిన లేఖపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేరకు చక్రవర్తి సూలిబెలెపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ నెల 14న బళ్ళారి కిత్తూరు రాణి చెన్నమ్మ పాఠ శాలలో టీమ్‌ మోదీ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘రాహుల్‌గాంధీని హత్యచేయాలని భావించేవారికి పురస్కారం ఇవ్వాలని ఎద్దేవా చేశారు’. ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన సూలిబెలెపై ఎందుకు చర్యలు తీసుకో కూడదని రాజ్యాంగాన్ని రక్షించాలనే సంస్థ కార్యదర్శి జగదీశ్‌ శెట్టర్‌ కోర్టును ఆశ్రయిం చారు. ఈ మేరకు జగదీశ్‌ మాట్లాడుతూ అదుపు తప్పి మాట్లాడడం సమాజానికి మంచిది కాద న్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *