రాహుల్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్ క్షమాపణ చెప్పారు. ‘చౌకీదార్‌ చోర్‌హై’ అని సుప్రీంకోర్టు అన్నట్లుగా గతంలో రాహుల్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌పై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కార కేసు పెట్టారు. ఈ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు రాహుల్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చౌకీదార్ వ్యాఖ్యలపై కోర్టును తప్పుదోవ పట్టిస్తారా అని రాహుల్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ వ్యాఖ్యలను తమకెలా ఆపాదిస్తారంటూ ఆయన తరపున న్యాయవాదిపై జస్టిస్ మండిపడ్డారు.
 
తాము అలాంటి పదాలను ఎక్కడా వినియోగించలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. రాహుల్ ఇప్పటివరకూ క్షమాపణ ఎందుకు చెప్పలేదని సుప్రీం ప్రశ్నించింది. ‘చింతించడం’ అనే పదం కోసం 22 పేజీల అఫిడవిట్ ఏంటని సుప్రీం ఆగ్రహించింది. సుప్రీం కోర్టుకు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ క్షమాపణలు చెప్పారు. కోర్టును కించపరిచే ఉద్దేశం లేదని, క్షమాపణ చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేస్తానని రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *