రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు షాక్..!


న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించేలా ఈసీని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రాహుల్‌కి బ్రిటీష్ పౌరసత్వం ఉందనీ, ఆయన ఎంపీ కాకుండా అడ్డుకోవాలంటూ ఢిల్లీకి చెందిన జై భగవాన్ గోయల్, చందర్ ప్రకాశ్ త్యాగి అనే వ్యక్తులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఓ ఎన్జీవోకి చెందిన వారమని చెప్పుకుంటున్న సదరు ఇద్దరు వ్యక్తులు.. రాహుల్‌కి బ్రిటన్ పౌరసత్వంపై ప్రశ్నించే ముందు ఆయన అసలు పౌరసత్వాన్ని నిర్ధారించాలని ధర్మాసనాన్ని కోరారు.
 
లండన్‌కి చెందిన బ్యాకోప్స్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపక సర్టిఫికెట్, ఆ కంపెనీ దాఖలు చేసిన రిటర్నులే రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని చెప్పడానికి ఆధారమని పిటిషనర్లు వాదించారు. రాహుల్ గాంధీ భారత పౌరుడు కాదని ప్రకటించాలనీ… ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని ధర్మాసనాన్ని కోరారు. కాగా 2015లో కూడా రాహుల్‌పై ఇదే తరహాలో దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. తాజాగా మళ్లీ విచారణకు స్వీకరించడం గమనార్హం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *