రియల్‌ కదలిక


  • మూడేళ్ల నుంచి తీవ్ర సంక్షోభంలో వ్యాపారం
  • కొద్ది రోజుల నుంచి ప్రారంభమైన భూముల క్రయవిక్రయాలు
  • ధరల పెరుగుదలపై ఆనందంలో రైతులు
మూడేళ్ల క్రితం వరకు కంచికచర్ల కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పవ్వులు ఆరుకాయలుగా విరాజిల్లింది. నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరు ప్రాంతానికి పోటీగా ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటాయి. జాతీయ రహదారి పక్కన ఎకరం రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ధర పలికింది. కంచికచర్ల నుంచి చెవిటికల్లు, పరిటాల మీదుగా గనిఆత్కూరు, కంచికచర్ల నుంచి మధిర వెళ్లే రోడ్డుల్లో ఎకరం రూ.కోటిన్నర వరకు పలికింది. మంచి ధర రావడంతో పంట భూములు అమ్మిన రైతులు కార్లు కొన్నారు. సకల సదుపాయాలతో కొత్త ఇళ్లు కట్టుకున్నారు. కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లి భూములు కొన్నారు. అధికారిక, అనధికారిక లేఅవుట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. అన్ని గ్రామాల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేశారు. అయితే ఒక్కసారిగా రియల్‌ ఎస్టేట్‌ రంగం చతికిలపడింది. మూడేళ్ల పాటు స్తబ్ధుగా ఉంది. మళ్లీ కొద్ది రోజుల నుంచి కొంత కదలిక వచ్చింది. భూములు కొనేందుకు వ్యాపారులు వస్తున్నారు. క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. పతనమైన ధరల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
కంచికచర్ల, ఏప్రిల్‌ 18: మూడేళ్ల నుంచి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కదలిక ప్రారంభమైంది. కొన్నాళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భూములు కొనేందుకు వస్తున్నారని, లావాదేవీలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం కంచికచర్ల – పరిటాల గ్రామాల మధ్య ఎకరం 1.70 కోట్ల రూపాయల చొప్పున వ్యాపారులు కొన్నారని, ఆ భూమే రెండు రోజుల క్రితం 2.40 కోట్ల రూపాయల ధర పలికిందని తెలిసింది.
 
500 మీటర్ల దూరం నిబంధనతో..
గ్రామాలకు దూరంగా లేఅవుట్లు వేస్తే మౌలిక సదుపాయాలు కల్పించడం చాలా కష్టమని ఐదు వందల మీటర్ల దూరం నిబంధనను ప్రభుత్వం ఇదివరకు తీసుకు వచ్చింది. నివాసిత ప్రాంతానికి ఐదు వందల మీటర్ల లోపు ఉన్న లేఅవుట్లకు మాత్రమే సీఆర్డీఏ అనుమతి ఇచ్చి ంది. అంతకు ఒక్క మీటరు అదనంగా ఉన్నా సీఆర్డీఏ తిరస్కరించింది. అంతకు ముందు వేసిన నాన్‌ లేఅవుట్లపైనా అధికారులు ఉక్కుపాదం మోపారు. నాన్‌ లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌ నిలిపివేశారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తిరోగమనం ప్రారంభమైంది.
 
అప్పుల ఊబిలో వ్యాపారులు
ఇదివరకు ప్రముఖ స్థిరాస్తి సంస్థ బత్తినపాడు కేంద్రంగా 200 ఎకరాలు కొనుగోలు చేసింది. భారీ వెంచర్‌ వేసింది. ఆ సంస్థకు ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. పరిటాల బైపాస్‌ రోడ్డు సమీపంలో 25 ఎకరాల్లో వెంచర్‌ వేసిన మరో సంస్థకు అప్పట్లో అనుమతి రాలేదు. దూరం నిబంధనతో లేఅవుట్ల కు అనుమతి నిరాకరించారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బతిన్నది. వ్యాపారులు లక్ష ల్లో పన్నులు చెల్లించి వెంచర్లు అభివృద్ధి చేశారు. మౌలిక సదుపా యాలు కల్పించారు. అనుమతి రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కొంత మంది ఇచ్చిన అడ్వాన్సులు వదిలేసుకున్నారు. దీంతో కొంతమంది వ్యాపారులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో భూముల ధరలు పాతాళానికి చేరాయి. ఆర్థిక అవసరాలున్న రైతులు తక్కువ ధరకు పొలం అమ్మేందుకు సిద్ధపడినా కొనుగోలు చేసే వారు లేకుండా పోయారు.
 
అభివృద్ధి చెందేందుకు అవకాశాలు
నవ్యాంధ్ర రాజధానికి అతిసమీపంలోని కంచికచర్ల ప్రాంతం త్వరితంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రతిపాదిత రాజధాని రైల్లే లైను, అవుటర్‌ రింగ్‌ రోడ్డు కంచికచర్ల నుంచే వెళ్లనున్నాయి. వైకుంఠపురం – దాములూరు రిజర్వాయరుతో రాజధానితో పాటుగా కంచికచర్ల మండలానికి ప్రయోజనం చేకూరనుంది. విజయవాడకు సమీపంలో జాతీయ రహదారిపై ఉండడంతో అభివృద్ధి పరుగులు తీయడానికి అవకాశమేర్పడింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *