రూ.700 కోట్లు బీజేపీకి ఎక్కడివి?: కమల్‌నాథ్


ఛింద్వారా: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ శనివారంనాడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో బీజేపీ కార్యాలయం నిర్మించడానికి పెద్దమొత్తంలో డబ్బు మీకు ఎక్కడ్నించి వచ్చిందని మోదీని ప్రశ్నించారు. కమల్‌నాథ్‌పైన, ఆయన ప్రైవేట్ సెక్రటరీ ప్రవీణ్ కక్కర్ ఇంటిపై ఐటీ దాడులను మోదీ పదేపదే ప్రస్తావిస్తుండటాన్ని కమల్‌నాథ్ తిప్పికొట్టారు.
 
‘ప్రధాని విమాన ప్రయాణాలకు అయ్యే ఖర్చులు ఎవరు భరిస్తున్నారో దేశ ప్రజలకు వివరించాలి. ఢిల్లీలో బీజేపీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఖర్చు చేసిన రూ.700 కోట్లు ఎక్కడ్నించి వచ్చాయో చెప్పాలి. ఈ ప్రశ్నలన్నింటికీ మోదీ మొదట సమాధానమిచ్చి ఆ తర్వాత నన్ను ప్రశ్నిస్తే బాగుంటుంది’ అని కమల్‌నాథ్ చురకలు వేశారు. ప్రధాని మోదీ శుక్రవారంనాడు జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో గర్భిణులకు, శిశు పౌష్టికాహారానికి కేటాయించిన సొమ్ములను దొంగిలించి తుగ్లక్ రోడ్డుకు పంపారంటూ, ఐటీ దాడుల్లో ఎంత పెద్దమొత్తంలో సొమ్ములు దొరికాయో ప్రజలంతా చూశారని పేర్కొన్నారు. ఇందులో ఓ పెద్ద కాంగ్రెస్ నేత ప్రమేయం ఉందన్నారు. ఒకవేళ తాను తప్పు చేసినా ఐటీ శాఖ తన నివాసంపై కూడా దాడులు చేస్తుందని మోదీ పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *