రెండు బైకులు ఢీకొని మహిళ మృతి


ప.గో: రెండు బైకులు ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పోడూరు మండలం కవిటం దగ్గర రెండు బైక్‌లు ఢికొన్నాయి. ఈ ఘటనలో కవిటం ఉత్తరపేటకు చెందిన పలనాటి శిరోమణి మృతిచెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే పలువురు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *