రెడ్‌క్రాస్‌తో సమాజ హితం కోసం సేవ


రైల్వే డీజీఎం భూమ
గుంటూరు (ఆంధ్రజ్యోతి): మానవ త్వపు విలువలు నేర్పి, సమాజ హితం కోసం సేవ చేసే అదృష్టాన్ని రెడ్‌ క్రాస్‌ ఇస్తుందని రైల్వే డీజీఎం భూమ తెలిపారు. జడ్పీ కార్యాల య ఆవరణలోని గుంటూరు రెడ్‌క్రాస్‌లో బుధ వారం ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భం గా జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగిం చారు. రెడ్‌క్రాస్‌ ద్వారా సమాజంలో అవసరమైన వారికి, ఆపన్నులకు సేవలు అందించాలన్నారు. తాను విద్యార్థి దశ నుంచే రెడ్‌ క్రాస్‌ మెంబర్‌గా ఉన్నట్లు గుర్తు చేశారు. పొగాకుబోర్డు కార్యదర్శి అద్దంకి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ యువత సేవా మార్గంలో ముందుకు సాగాలన్నారు. రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ వడ్లమాని రవి, వైస్‌ చైర్మన్‌ రామచంద్రరాజు, రాష్ట్ర ప్రతినిధి కోటయ్య, రాష్ట్ర కోశాధికారి జీవైఎన్‌ బాబు తదితరులు ప్రసంగించారు. సభలో రెడ్‌ క్రాస్‌లో విభిన్న అంశాలలో సేవలు అందించిన వారికి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌ రూపొందించిన వేసవి జాగ్రత్తల బ్రోచర్‌ను విడుదల చేశారు. 100 మంది గర్భిణులకు పోషక పదార్థాలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *