రేపటి నుంచి ఎంసెట్‌


  •  నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
  •  20-23 తేదీల్లో ఇంజనీరింగ్‌
  •  23-24 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్ష: కన్వీనర్‌
అమరావతి, జేఎన్‌టీయూకే, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఎంసెట్‌-2019)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆన్‌లైన్‌లో శనివారం నుంచి 23 వరకు (7 సెషన్లు) ఇంజనీరింగ్‌ విభాగం, 23-24 తేదీల్లో (3 సెషన్లు) అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగపు పరీక్షలు జరగనున్నాయి. రోజూ ఉదయం10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సా.2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌లో 30వేల మందికి అవకాశం కల్పించారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిషు, తెలుగు మీడియంలో ఆబ్జెక్టివ్‌ టైపులో ఉంటాయి. రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తుల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం 2,82,633 మంది అభ్యర్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరుకానున్నారు. ఇందులో ఇంజనీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది, అగ్రికల్చర్‌, మెడికల్‌లో 86,910 మంది ఉన్నారు. ఏపీ ఎంసెట్‌-2018తో పోలిస్తే 6,638 మంది అభ్యర్థులు పెరిగారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 3,586 మంది తగ్గగా.. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగంలో 10,224 మంది పెరిగారు. ఈసారి నర్సింగ్‌, ఫిజియో థెరఫీ కోర్సుల వారికి అర్హత కల్పించడంతో మెడికల్‌ విభాగంలో అభ్యర్థుల సంఖ్య పెరిగిందని ఎంసెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఎంసెట్‌కు ఏపీలో 109 సెంటర్లు, హైదరాబాద్‌లో 6 వెరసి.. 115 టెస్ట్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు.
 
చివరి నిమిషంలో స్వల్ప మార్పులు
ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకుని, హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థుల సంఖ్యలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదివారం (21న) ఎన్‌డీఏ ఎగ్జామ్‌ కూడా ఉన్నందున దాదాపు 1000 మంది అభ్యర్థులకు ఎంసెట్‌ రాసే స్లాట్‌ను వారు కోరుకున్న తేదీలకు మార్చారు. దాదాపు 50 మంది అభ్యర్థుల గ్రూపుల్లో తేడాలుండటంతో మార్పులు జరుగుతున్నాయి.
 
అభ్యర్థులకు సూచనలు
  • జూ పరీక్షా కేంద్రానికి గంట ముందు హాజరుకావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. 
  • పరీక్ష హాల్లోకి విద్యార్థి ఎంసెట్‌ హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, పెన్నులు, అటెస్టేషన్‌తో కూడిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే) మాత్రమే అనుమతించబడతాయి. 
  • స్మార్ట్‌, మొబైల్‌ ఫోన్లు, వాచీలు, చిప్‌ ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించరు.
  •  పరీక్షకు ముందు బయోమెట్రిక్‌ విధానంలో ఆయా విద్యార్థుల వేలిముద్రలు స్వీకరిస్తారు. పరీక్ష మొదలైన వెంటనే విద్యార్థికి మిగిలి ఉన్న సమయాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్‌ సూచిస్తుంది. 
  • ఎంసెట్‌కు సంబంధించిన సందేహాల నివృత్తికి 0884 2340535, 2356255 నంబర్లకు లేదా 2k19apeamcet@gmail.com మెయిల్‌ ద్వారా సంప్రదించాలని కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు సూచించారు. 
  • పరీక్ష కోడ్‌ను శనివారం ఉదయం 8 గంటలకు విడుదల చేస్తారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *