రైల్లో శ్రీకాకుళం జవాను ఆత్మహత్య


న్యూఢిల్లీ, మే 2(ఆంధ్రజ్యోతి): భారత వైమానిక దళంలో నాన్‌ కమిషన్డ్‌ ఎయిర్‌మన్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాను బి. వెంకటేశ్‌(23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం… నర్సన్నపేట ఉర్లం మండలం చింటువానిపేటకు చెందిన వెంకటేశ్‌ 2007 ఆగస్టులో ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. అధికారిక పని నిమిత్తం మధ్యప్రదేశ్‌లోని ఆమ్లా నుంచి పంజాబ్‌లోని హల్వారాకు ఛత్తీస్‌గఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఫస్ట్‌ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం రైల్లోనే తన 9ఎంఎం కార్బైన్‌ సబ్‌ మెషిన్‌గన్‌తో తలపై కాల్చుకున్నాడు. ఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని ఆగ్రా ఏరియా జీఆర్‌పీ సీనియర్‌ ఎస్పీ అభిషేక్‌ యాదవ్‌ తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *