లంకకు పక్కా ‘ఉగ్ర’ సమాచారం!


  • ఈ నెల మొదట్లోనే అందజేసిన భారత్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: శ్రీలంకలో ఉగ్రవాద దాడులకు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని భారత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఈ నెల మొదట్లోనే ఆ దేశానికి అందించింది. దక్షిణ భారతంలోని కీలక హిందూ నేతలను హతమార్చేందుకు ఒక ఐఎస్‌ ప్రేరిత ముఠా కుట్ర చేస్తోందన్న అభియోగాలపై తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేసింది. నిందితుల విచారణ సందర్భంగా శ్రీలంకలో ఆత్మాహుతి దాడుల కుట్ర వెలుగులోకి రావడంతో ఆ దేశ భద్రతా అధికారులకు తక్షణమే సమాచారమిచ్చినట్లు ఎన్‌ఐఏ వర్గాలు బుధవారమిక్కడ తెలిపాయి. ‘దర్యాప్తు సమయంలో నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌(ఎన్‌టీజే) నాయకుడు జహ్రాన్‌ హషీం వీడియో ప్రసంగాలను అనుకోకుండా ఎన్‌ఐఏ అధికారు లు చూశారు. కొలంబోలోని భారత హైకమిషన్‌ కార్యాలయాన్ని పేల్చేయాలన్న కుట్ర అతడి ప్రసంగంలో బయటపడింది. దీంతో మరింత లోతుగా విచారణ చేపట్టాం. శ్రీలంకలోని చర్చిలను ఐఎస్‌ మాడ్యూల్‌ టార్గెట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తేలడంతో.. కేంద్ర భద్రతా సంస్థలు శ్రీలంకకు తెలియజేశాయి’ అని ఆ వర్గాలు వెల్లడించాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *