లయన్స్‌ సుప్రీమ్‌కు బెస్ట్‌ సర్వీస్‌ అవార్డులు


విజయవాడ: లయన్స్‌ ఇంటర్నేషనల్‌ క్లబ్‌ ద్వారా సుప్రీమ్‌కు సేవా కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం లభించడంతో పాటు క్లబ్‌కు బెస్ట్‌ సర్వీస్‌, కార్యనిర్వాహక సభ్యులకు బెస్ట్‌ అవార్డులు లభించాయని సుప్రీమ్‌ జోనల్‌ చైర్మన్‌ పెనుమత్స అప్పలరాజు హర్షం వ్యక్తం చేశారు. లయన్స్‌ అంతర్జాతీయ సంస్థ ద్వారా అవార్డులు తీసుకోవడంపై క్లబ్‌ సభ్యులు సోమవారం రామకృష్ణాపురం కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ 2017 – 18 లయనిస్టిక్‌ సంవత్సరానికి సంబంధించి లయన్స్‌ ఇంటర్నేషనల్‌ ఇటీవల నెల్లూరులో అవార్డులు ప్రదానం చేసిందన్నారు. క్లబ్‌ ఇంటర్నేషనల్‌ కార్యదర్శి వేగేశ్న విజయ్‌కుమార్‌రాజు, డైరెక్టర్‌ చిగురుపాటి వరప్రసాద్‌, మల్టీపుల్‌ చైర్మన్‌ డిఎస్‌ఎస్‌ వర్మ, అవార్డు కమిటీ చైర్మన్‌ ఉపేంద్రల చేతుల మీదుగా క్లబ్‌కు బెస్ట్‌ అవార్డుతో పాటు బెస్ట్‌ ప్రెసిడెంట్‌, బెస్ట్‌ సెక్రటరీ, బెస్ట్‌ ట్రెజరర్‌, బెస్ట్‌ జోనల్‌ చైర్మన్‌ అవార్డులు లభించాయన్నారు. ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు చక్రధర్‌, శేషసాయి, సాయిబాబు పాల్గొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *