లోక్‌సభ ఎన్నికల్లో ఓటువేసిన ఢిల్లీ తొలి మహిళా ఎమ్మెల్యే


న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈరోజు లోక్‌సభ ఆరవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీలో తొలి మహిళా ఎమ్మెల్యేగా పనిచేసిన పుష్పాదేవి (96) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న పుష్పాదేవి వీల్‌చైర్‌లో కూర్చుని ఇద్దరి సాయంతో పోలింగ్ బూత్‌కు చేరుకుని ఓటు వేశారు. ఆమె లోథాస్టేట్‌లో ఉన్న విద్యాభవన్ మహావిద్యాలయ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఢిల్లీలో తొలిసారిగా 1951లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో ఆమె కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (కేఎంపీపీ) అభ్యర్థి గుర్దిత్ సింగ్‌ను ఓడించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *