వంశధారపై వెనక్కు తగ్గిన ఒడిసా


శ్రీకాకుళం/న్యూఢిల్లీ, మే 9 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణంపై ఒడిసా ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టుపై కొర్రీలు వేస్తూ వచ్చిన ఒడిసా… వంశధార ట్రైబ్యునల్‌, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) వరుసగా ఏపీకి అనుకూలంగా ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఒడిసా దిగిరాక తప్పలేదు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడం సాధ్యంకాక.. కొన్నేళ్ల కిందట సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రక టించింది. ఆ వాదనను నమోదుచేసిన ధర్మాసనం ఒడిసా పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో నేరడి బ్యారేజీకి చిక్కుముళ్లు వీడినట్లయింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *