వాటర్‌ ట్యాంకులో పురుగు మందు!


  • వాచ్‌మన్‌ గుర్తించడంతో తప్పిన ముప్పు
కొవ్వూరు, ఏప్రిల్‌ 21 : ఊరిపై కోపమో.. మరేదైనా కారణమో.. గుర్తు తెలియని వ్యక్తులు రక్షిత మంచి నీటి ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లో పురుగు మందు కలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఆదివారం ఈ విషయం కలకలం రేపింది. సుమారు ఆరు వేల జనాభా ఉన్న గ్రామానికి రోజూ గ్రామ పంచాయతీ ద్వారా 90 వేల లీటర్ల ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. రోజూ మాదిరిగా తాగునీటి సరఫరాకు ఆదివారం ఉదయం 5.30 గంటలకు నైట్‌ వాచ్‌మెన్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ వాల్‌ విప్పడానికి వచ్చారు. పురుగు మందు వాసన రావడంతో పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావుకు సమాచారమిచ్చారు. ఆయన రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *