వారికెవరు దిక్కు?


  • భార్యా పిల్లలను అనాథలను చేసిన ప్రమాదం
గద్వాల: ప్రమాద మృతుల్లో నెల వయసు బిడ్డను, బాలింత అయిన భార్యను వదిలి అనంతలోకాలకు వెళ్లిపోయిన విజయ్‌.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరొకరు… కుటుంబ పెద్దను కోల్పోయి ఆధారం లేకుండాపోయిన వారైతే ఎంతోమంది. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒక్కో బాధిత కుటుంబాన్ని కదిలిస్తే ఒక్కో కన్నీటి గాథ! 15 మృతుల్లో ఎక్కువమంది భార్యాపిల్లలు ఉన్నవారే. భర్త చనిపోవడంతో ఐదుగురు పిల్లలను ఎలా పోషించేదంటూ మృతుడు చింతలన్న భార్య గుండెలు బాదుకుంటోంది. మృతుల్లో పౌల్‌కు భార్య, కూతురు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో వారిని ఓదార్చడం ఎవ్వరివల్లా కావడం లేదు. తిక్కన్నకు భార్య, ఇద్దరు కూతుళ్లు. భర్త చనిపోవడంతో పిల్లలను ఎలా పోషించాలంటూ ఆమె రోదిస్తోంది. నాగరాజు, పరుశరాముడు, చిన్న సోమన్న, రాముడు, భాస్కర్‌లకు భార్యాపిల్లలున్నారు. ఉన్నతంలో చక్కగా సాగుతున్న వీరి జీవితాలు పెద్ద దిక్కును కోల్పోవడంతో తలకిందులయ్యాయి. మృతుల్లో గోపినాఽథ్‌ అనే యువకుడికి ఇటీవలే పెళ్లి కుదిరింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *