విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ప్రైవేటు బస్సు బోల్తా


విజయవాడ: కృష్ణాజిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది చిన్నారులతో సహా 30మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి యానాం వెళ్తున్న రమణ ట్రావల్స్ బస్తు పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద పల్టీలు కొట్టింది. క్షతగాత్రులను నందిగామ, విజయవాడ ఆస్పత్రులకు తరలించారు. రమణ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి యానాం వెళ్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్‌కు ఎన్నిసార్లు హెచ్చరించిన లెక్క చేయకుండా బస్సు వేగంగా నడిపాడని ప్రయాణికులు వాపోతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *