వినయం, వినడం నాయకుడి లక్షణం


శాసనమండలిలో పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుబ్రహ్మణ్యం
 
విజయవాడ(మొగల్రాజపురం): నాయకుడికి వినయంతో పాటు ఎదుటి వారు చెప్పే విషయాన్ని ఓపిగ్గా వినే లక్షణం ఉండాలని శాసనమండలిలో పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఆదివారం యూటీఎఫ్‌ పీడీఎఫ్‌ ఆధ్వర్యంలో పీబీ సిద్ధార్థ ఆడి టోరియంలో అభినందన సభ నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లు నిజాయితీగా ఓటేశారన్నారు. సాధా రణ ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా జరిగిందని పత్రికలలో కథనాలు వచ్చా యన్నారు. ప్రజలు మన మీద పెట్టుకున్న ఆశలను గుర్తించి కేవలం వారి సమస్యలనే కాకుండా ఉపాధ్యాయేతర సంఘాల సమస్య లను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో రాబోయే రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగులే ఉంటారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యో గుల సమస్య లను ప్రస్తావించాల్సిన అవ సరం ఉందన్నారు. ప్రశ్నించే వాడు కావాలా ప్రాధేయపడేవారు కావాలా అంటే పట్ట భధ్రులు, ఉపాధ్యాయులు ప్రశ్నించే వారినే తమ ప్రతినిధిగా భారీ మెజార్టీతో ఎన్ను కున్నందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రయివేటు ఉపాధ్యాయులను కూడా మనలో భాగం అయ్యేలా చూడాలని కోరారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మ, తెలంగాణాలో ఎన్నికైన అలుగుబెల్లి నర్సిరెడ్డి లను సత్కరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *