వివేకా హత్యలో ఇంటి దొంగలెవరో తేల్చాలి


  • జగన్‌, అవినాష్‌, విజయసాయిలనూ విచారించాలి: వర్ల
అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తీరు శోచనీయంగా ఉందని, దర్యాప్తు ముందుకు సాగించకుండా మీనమేషాలు లెక్కిస్తోందని ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య ఆరోపించారు. గురువారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడతూ… వివేకా హత్యను ఇంటి దొంగల పని అన్నప్పుడు ఇంటి దొంగలెవరో ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. ఈ కేసులో ఉత్సవ విగ్రహాల్లాంటి ముగ్గురిని అరెస్టు చేసి, మూలవిరాట్టు లాంటి ఇంటి దొంగలను పక్కకు నెట్టారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో జగన్‌, అవినా్‌షరెడ్డి, విజయసాయిరెడ్డిలను కూడా విచారించాలని డిమాండ్‌ చేశారు. కేసును గాలికి వదిలేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *