విశాఖలో నాటుబాంబు పేలి అప్పలసూరికి గాయాలు


విశాఖపట్నం: జిల్లాలోని ఆరిలోవ పీఎస్ పరిధిలోని కృష్ణానగర్‌లో నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో అప్పలసూరి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. పందులు పట్టుకునేందుకు అమర్చిన నాటు బాంబులు తయారుచేస్తుండగా నాటుబాంబు పేలింది. ప్రమాదంలో గాయపడ్డ సూరిని అత్యవసర చికిత్సకై హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్య అందిస్తున్నారు. ఈ ఘటనలో అప్పల సూరి భార్యకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *