విశాఖ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్


విశాఖ: నగరంలో జరిగిన రేవ్‌ పార్టీ డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. నిందితుల కాల్‌ డేటా ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. కోడ్‌ లాంగ్వేజ్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఆన్‌లైన్‌లోనూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. డ్రగ్స్ సరఫరా కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ వీర రాఘవ అలియాస్‌ సోను కోసం గాలింపు చేపట్టారు. ఇతర రాష్ట్రాల డ్రగ్స్‌ మాఫియాతో సోనుకు సంబంధాలున్నట్టు విచారణలో తేల్చారు. ఇదిలా ఉంటే ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ సుబ్బారావు వారం రోజుల సెలవుపై వెళ్లడం గమనార్హం.
 
గత శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోరెత్తిపోయే శబ్దాలతో .. అసభ్యకర నృత్యాలతో రెచ్చిపోయిన యువతపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో .. పోలీసులు అక్కడికి చేరుకుని.. వారిని పంపించేసినట్టు సమాచారం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *