వీఎంసీలో సంస్కరణలకు శ్రీకారం


  • వీఎంసీలో మార్పులకు మేయర్‌ యత్నాలు
  • ఆగిన పనుల కొనసాగింపునకు వినతులు
  • సిబ్బందిపై వేటుకు సిద్ధం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నగరపాలక సంస్థలో పలు విభాగాల్లో దుబారా వ్యయం తగ్గించడంతో పాటు పలు సంస్కరణలు చేపట్టేందుకు మేయర్‌ శ్రీధర్‌ శ్రీకారం చుట్టారు. స్వీపర్ల నుంచి అటెండర్ల వరకు కింది స్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధం చేశారు. అధిక శాతం ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా సంస్కరణల అమలు చేసేందుకు మేయర్‌ కోనేరు శ్రీధర్‌ కమిషనర్‌ మట్టా రామారావుతో చర్చలు నిర్వహించారు. సంస్కరణళళలల ల ద పాటు కార్పొరేషన్లో నిలిచిన పనుల కొనసాగింపుపై ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలోని దాదాపు 11 విభాగాలకు గానూ ఒక్కో చాంబర్‌ వద్ద ముగ్గురు నుంచి ఐదుగురు అటెండర్లు ఉంటున్నారు. అదనంగా విధుల్లో ఉన్న వారి విధుల మార్పునకు మేయర్‌ సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి చాంబర్‌ వద్ద అవసరానికి మించి ఉన్న అటెండర్లను మార్చి ఉపయోగపడే విభాగాలకు బదిలీ చేయాలని భావిస్తున్నారు. అలాగే విభాగాధికారులు మొదలు అధికారులు, సిబ్బందిలో 60 శాతం ఉపయోగిస్తున్న సెల్‌ ఫోన్ల కారణంగా వీఎంసీకి ఆర్థిక భారం అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ల్యాండ్‌లైన్‌ ఇంటర్‌కామ్‌(అంతర్గత ఫోన్‌ కాల్స్‌కు ఉచిత కనెక్షన్‌)ను పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సెల్‌ ఫోన్ల కారణంగా బిల్లులు లెక్కకు మించి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్‌ రామారావును కలిసి పలు అంశాలపై చర్చించిన మేయర్‌ వాటి అమలుపై కూడా మాట్లాడారు. అయితే కింది స్థాయిలో జరుగుతోన్న బదిలీలు, ఖర్చులపై చర్యలు తీసుకోవడానికి పలువురు కమిషనర్లు కూడా ఆసక్తి చూపని నేపథ్యంలో ప్రస్తుత కమిషనర్‌ ఎంతవరకు స్పందిస్తారోనన్నది ప్రశ్నార్థకమే.
 
ఎన్నికల కమిషన్‌కు వినతి?
ఎన్నికల కోడ్‌ కారణంగా కార్పొరేషన్‌ పరిధిలో నిలిచిపోయిన పలు పనులపై ఎన్నికల కమిషన్‌ నుంచి అంగీకారం పొందాలని లేదా సాధ్యా సాధ్యాలపై వివరణ కోరడానికి మేయర్‌ శ్రీధర్‌ పలువురు కార్పొరేటర్లతో కలిసి నిర్ణయించారు. వినతి పత్రాలను సిద్ధం చేసిన నేపథ్యంలో త్వరలో కమిషనర్‌ను కలిసి పరిస్థితిని వివరించనున్నారు. వీఎంసీ కార్పొరేటర్ల పదవీ కాలం కొద్ది నెలల్లో ముగియబోతున్న క్రమంలో చివరి సమయంలో పనులు ఆగిపోతే కార్పొరేషన్‌పై ప్రజల నమ్మకం సన్నగిల్లే అవకాశమున్నందున ఎన్నికల కమిషన్‌కు వినతులు సమర్పించాలన్న నిర్ణయానికి మేయర్‌ వచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *