వీఐపీ టిక్కెట్ల నియంత్రణకు సహకరించాలి


  • ప్రముఖులకు జేఈవో శ్రీనివాసరాజు వినతి
తిరుమల, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఈ వేసవిలో వారాంతాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శన టిక్కెట్ల నియంత్రణకు రూపొందించిన నియమావళి అమలుకు అందరూ సహకరించాలని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవుల్లో, ప్రధానంగా వారాంతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నట్టు తెలిపారు. ఈ రద్దీని ముందుగానే ఊహించి గతంలో మాదిరిగా ఈసారి కూడా జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ను రద్దుచేసి ప్రొటోకాల్‌కే పరిమితం చేస్తున్నట్టు తెలిపారు. వీఐపీ బ్రేక్‌ నియంత్రణ అమల్లోకి వచ్చిన తరువాత గత శనివారం ఒక్క రోజునే 92,840 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, గత శనివారం కంటే పదివేల మందికి అదనంగా దర్శనం కల్పించామన్నారు. ఈపరిస్థితులలో వీఐపీ టిక్కెట్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి చేయవద్దని, అలాంటి సిఫారసులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ప్రముఖ హోదాల్లో ఉన్న వీఐపీలు కూడా ఆరు టిక్కెట్లకు మించి కోరకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే రెండో రోజున మళ్లీ వీఐపీ టిక్కెట్లు ఇవ్వలేమని, అందరూ సహకరించాలని కోరారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *