వీవీఐటీలో కెపాసిటీ బిల్డింగ్‌ శిక్షణ తరగతులు


పెదకాకాని, మే 6: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఎం స్కిల్‌ సెంటర్స్‌లో ట్రైనర్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) నోడల్‌ కేంద్రమైన వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో కెపాసిటీ బిల్దింగ్‌ శిక్షణ తరగుతులను సంస్థ సీఈవో శ్రీకాంత్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో ట్రైనర్స్‌ వెన్నెముక లాంటి వారని, విద్యార్థుల్లో నైపుణ్యం, పబ్లిక్‌ స్పీకింగ్‌, కమ్యూనికేషన్స్‌ ప్రజంటేషన్‌ వంటి నైపుణ్యాలు పెంపొందించడంలో వారి పాత్ర కీలకమని చెప్పారు.
 
ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పాజిటివ్‌ థింకింగ్‌ పెంపొందించేందుకు ఈ శిక్షణ దోహద పడుతుందని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా తరగతులను ఎఫెట్రానిక్స్‌ సంస్థ సీఈవో దాసరి రామకృష్ణ, జీవీఎస్‌ రాజు, హరిప్రసాద్‌, రమణబాబు తదితర ప్రముఖులు నిర్వహి స్తున్నారన్నారన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ట్రైనర్స్‌ తాము నేర్చుకున్న అంశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *