వీవీ ప్యాట్ స్లిప్పులు 50శాతం లెక్కించాలి: మాల్యాద్రి


అమరావతి: వీవీ ప్యాట్ స్లిప్పులు 50శాతం లెక్కించాలని టీడీపీ నేత మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై దేశంలో విపక్షాలు పోరాటం చేస్తున్నాయన్నారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్‌, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఆ ఊసు ఎత్తడంలేదని ఆరోపించారు. దేశంలో అత్యంత వేగంగా నిర్మితమవుతున్న పోలవరంపై మాత్రం విమర్శలు కురిపిస్తున్నారని, ప్రాజెక్ట్‌ భద్రతకు ఇబ్బంది లేకుండా నిర్మాణం జరుగుతోందన్నారు. డంప్‌యార్డ్‌ దగ్గర పగుళ్లను చూసి ప్రాజెక్ట్‌ ప్రమాదంలో ఉందని ఉండవల్లి ఎలా చెబుతారని మాల్యాద్రి ప్రశ్నించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *