వేజండ్ల ఘటనపై విచారణ


గుంటూరు: వేజండ్ల రైల్వేస్టేషన్‌లో గత శనివారం జరిగిన రైలు దుర్ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ అయిన సికింద్రాబాద్‌లో రైల్వే అధికారులు విచారణ జరిపారు. శుక్రవారం అక్క డికి గుంటూరు రైల్వే డివిజన్‌ అధికారులను పిలిపించారు. సీనియర్‌ డీఈఎన్‌ నార్త్‌, వేజండ్ల ఎస్‌ఎస్‌, రైల్వేగార్డు, లోకో పైలట్‌, ఆర్‌ వీఎన్‌ఎల్‌ సిబ్బంది, రాజమండ్రి లోకోషెడ్డు అధికారులను పిలిపించి ఉదయం నుం చి రాత్రి 7.30గంటల వరకు గుచ్చిగుచ్చి విచారించారు. ప్రమాదం జర గడానికి ముందురోజున ఒకటో నెంబరు ప్లాట్‌ఫాంకు ఫిట్‌నెస్‌ ఇచ్చిన తర్వాత తొలిగాతీసుకొన్న గుంటూరు-తిరుపతి ప్యాసింజర్‌కుసిగ్నల్‌ ఇచ్చి న అధికారిని ప్రశ్నించారు.ఒక్కో అధికారిని లోపలికి పిలిచి రహస్య విచా రణ జరిపారు. ఇప్పటికే క్షేత్ర విచారణని అధికారులు పూర్తిచేశారు. ప్ర మాదంలో గాయపడిన ముగ్గురు క్షతగాత్రులకు సాయం అందించే చర్య లు చేపట్టారు. ఇక ప్రమాదానికి దారితీసిన స్పష్టమైన కారణాన్ని గుర్తిం చి అందుకు బాధ్యులైన వారిపై చర్యలకు కమిటీ సిఫార్సు చేయనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *