వేసవి రద్దీకి 80 ప్రత్యేక రైళ్లు


నరసాపురం, ఏప్రిల్‌ 27: వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 80 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధం అవుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కేవి రావు చెప్పారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రైల్వేస్టేషన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. గత ఏడాది ప్రత్యేక రైళ్ల వల్ల సుమారు రూ.50 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు 20కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపామని.. సుమారు రూ.10 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేకు రోజుకు రూ.48 కోట్లు ఆదాయం లభిస్తోందని.. ఇందులో రూ.30 కోట్లు గూడ్స్‌ ఎగుమతులు, రూ.18 కోట్లు ప్రయాణికుల ద్వారా వస్తున్నట్లు ఆయన చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *