‘వైసీపీ నేతలకు గుణపాఠం చెప్పాలి’


విజయవాడ: ప్రభుత్వ రహస్యాలను కొందరు పెన్‌డ్రైవ్‌లో తీసుకెళ్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ఆరోపించారు. సచివాలయంలోని వచ్చి వైసీపీ నేతలు దొంగతనంగా ప్రభుత్వ నోట్‌ ఫైల్స్‌ను తీసుకెళ్తుంటే ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కొందరు అధికారులు వైసీపీ నేతలకు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఫైల్స్‌ ఎత్తుకెళ్తున్న వైసీపీ నేతలకు గుణపాఠం చెప్పాలని ఆనందసూర్య ఈసీని కోరారు. ఇటీవల సచివాలయంలోని ఒక ముఖ్యమైన అధికారి చాంబర్‌లోకి ఒక వ్యక్తి వెళ్లారు. దాదాపు 20 నిమిషాల తర్వాత బయటికి వచ్చారు. ఒక పెన్‌డ్రైవ్‌ను ఎంచక్కా తన ప్యాకెట్‌లో పెట్టుకుని వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *