వైసీసీ నేతల విందులో ఎస్‌ఐ హల్‌చల్


నెల్లూరు: ఏపీలో కొంతమంది పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. ఓ పార్టీకి మద్దతుగా నిలిచి అడ్డంగా బుక్కవుతున్నారు. గూడూరు టూటౌన్‌ ఎస్‌ఐ.. వైసీపీ నేతల విందులో పాల్గొని చిక్కుల్లో పడ్డారు. వైసీపీ నేతలతో కలిసి ఎస్‌ఐ బలరామిరెడ్డి హల్‌చల్‌ చేశారు. ఈ బాగోతం సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఎస్‌ఐ తీరుపై డీజీపీ, రిటర్నింగ్‌ అధికారికి ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఇటీవల పెనమలూరు పోలీసుల తీరుపై కూడా టీడీపీ నేత బోడె ప్రసాద్ సీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీకి పెనమలూరు సీఐ సహకరించారంటూ విజయవాడ సీపీకి బోడె ప్రసాద్ ఫిర్యాదు చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *