శుక్రవారం వ్యవసాయశాఖపై సోమిరెడ్డి సమీక్ష..


అమరావతి: మంత్రుల సమీక్షలకు హాజరయ్యే అంశంపై అధికారులకు ఎన్నికల సంఘం  క్లారిటీ ఇచ్చింది. సమీక్షకు వెళ్లొద్దని తాము ఎవరికీ చెప్పలేదని ఎన్నికల కమిషన్‌ స్పష్టంచేసింది. రెండ్రోజుల క్రితం నిబంధనల పేరుతో ఉద్యోగులు మంత్రి సోమిరెడ్డి సమీక్షకు హాజరుకాలేదు. సమీక్షకు రాకపోవడంపై మంత్రి.. అధికారులను వివరణ కోరారు. వ్యవసాయశాఖ అధికారులేమో ఈసీని సంప్రదించారు. సమీక్షకు వెళ్లొద్దని తాము చెప్పలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో సమీక్షకు వస్తామని మంత్రి కార్యాలయానికి అధికారులు సమాచారమిచ్చారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రకృతి వైపరిత్యాలపై సోమిరెడ్డి తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ అధికారులంతా హాజరుకానున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *