శ్రీకాకుళంలో పునరుద్ధరణ పనులు ముమ్మరం


  • ఆర్టీజీఎస్‌ నిత్యం పర్యవేక్షణ
  • సమస్యలు ఉంటే 1100కు ఫోన్‌ చేయండి
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): తుఫాను వల్ల దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో సహాయ సేవా కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు ఆర్టీజీఎస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారానికల్లా పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొంది. సెల్‌ టవర్లను శుక్రవారానికే పునరుద్ధరించినట్లు తెలిపింది. బాధితులకు సమస్యలు ఉంటే 1100కి కాల్‌ చేయాలని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ మూడు రోజుల్లో 63996.4 క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్టు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో వైద్యసేవలు ముమ్మరంగా అందిస్తున్నట్టు తెలిపింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *