శ్రీలంకలో భద్రతాబలగాల దాడి… 15 మంది ఉగ్రవాదుల హతం


కొలోంబో : శ్రీలంక దేశంలోని చర్చ్ లో ఉగ్రవాదుల పేలుళ్ల ఘటన అనంతరం ఆ దేశ భద్రతాబలగాలు దాడి చేసి 15 మంది అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. శ్రీలంకన్ భద్రతా బలగాలు శుక్రవారం రాత్రంతా జరిపిన దాడుల్లో ఆరుగురు పిల్లలతో సహా 15 మంది ఉగ్రవాదులు మరణించారు. అంపార ప్రాంతంలోని సెంథామారుతూ వద్ద ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారని శ్రీలంక భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు వారి కోసం గాలిస్తుండగా ఉగ్రవాదులు ఇంటి నుంచి కాల్పులు జరిపారు. మిలిటెంట్లు మూడు సార్లు పేలుడు పదార్థాలు సైతం విసిరారు. ఈ ఘటనలో 15 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.మరో ముగ్గురు ఇతరులు కూడా గాయపడ్డారు.
 
ఉగ్రవాదుల రహస్య స్థావరంలో భద్రతా బలగాలకు మందుగుండు సామాగ్రి, డిటోనేటర్లు, సూసైడ్ కిట్స్, మిలటరీ యూనిఫాం, ఇస్లామిక్ స్టేట్ జెండాలు లభించాయని శ్రీలంక పోలీసులు చెప్పారు. చర్చ్ పేలుళ్లలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదసంస్థకు చెందిన 140 మంది అనుమానితులను గుర్తించిన శ్రీలంక పోలీసులు వారిని పట్టుకునేందుకు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. పదివేలమంది శ్రీలంకన్ సైనికులతో ప్రార్థనాలయాలు, సముద్ర తీరప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశారు. 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *