శ్రీలంక పేలుళ్ళపై రాహుల్ గాంధీ ప్రగాఢ సంతాపం


న్యూఢిల్లీ : వరుస పేలుళ్ళతో కంపించిన శ్రీలంక పరిస్థితి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వంద మందికి పైగా మరణించడానికి, 300 మందికి పైగా గాయపడటానికి కారణమైన బాంబు పేలుళ్ళ వార్తలు విని తాను తీవ్ర ఆందోళన చెందినట్లు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద రాక్షస కృత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ దారుణ మారణ కాండలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
 
ఆదివారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో మూడు చర్చిలు, మూడు హోటళ్ళలో బాంబు పేలుళ్ళు సంభవించాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరో రెండు పేలుళ్ళు జరిగాయి. మొత్తం మీద 187 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది.
 
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ఆ దేశ ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘేలతో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. శ్రీలంకకు సాధ్యమైనంత సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. వరుస బాంబు పేలుళ్ళ వల్ల జరిగిన మారణకాండ పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *